Guidelines

Siddha Antarmukha Yogam Samuhika Satsang
నీ శ్వాస మార్చుకో - నీ సమాజం మారుతుంది
Change your breath - your society will change

సామూహిక సత్సంగం మీ సాధన మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చాలా వేగంగా పెంచడంలో చాలా సహాయం చేస్తుంది. శ్రీ గురూజీ మీ ప్రాంతంలో సత్సంగం నిర్వహించేందుకు సాధకులకు అవకాశం ఇస్తున్నారు. మీకు ఆసక్తి ఉంటే దయచేసి మీ పేరు మరియు వాట్సాప్ నంబర్, చిరునామా ఈ క్రింది లింక్ లో ఇవ్వండి. సద్గురువుల కృప మరియు ఆశీర్వాదాలు ఆనందించండి.
Group satsang will fetch you a lot in increasing your sadhana and spiritual knowledge very speedily. Shri Guruji is giving the opportunity to the devotees to organize a satsang in your area. If you are interested please give your name and whatsapp number and address in the following link. Enjoy the grace and blessings of Sadguru.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfF3KR_HTmldKKc6fWsoVLYqDg41KHu9YCCcSGAy552oMUHcw/viewform



సత్సంగానికి సూచనలు Instructions for the Satsang

1. సమయం 2 నుండి 3 గంటలు, సరిగ్గా సమయానికి ప్రారంభించండి మరియు ముగించండి. Time 2 to 3 hours, start and finish on time exactly.
2. మీకు నచ్చిన ఏదైనా రోజు - Any day you like
3. దుస్తుల కోడ్: పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ తెల్లటి సాధారణ బట్టలు. - Dress code: White plain clothes for both men and women.
4. పుస్తక పఠనం: యోగం ధ్యానం జ్ఞానం లోని ఒక అధ్యాయాన్ని చదివి చర్చించండి మరియు భగవద్గీత యొక్క ఒక అధ్యాయాన్ని చదవండి మరియు చర్చించండి. దయచేసి ఈ సత్సంగంలో ఏ ఇతర విషయాలను లేదా రాజకీయాలను లేదా ఇతర సాధనలను తీసుకురావద్దు. యోగాపై దృష్టి కేంద్రీకరించి ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. Book Reading: Read and discuss a chapter in Yogam Dhyanam Jnanam and a chapter from Bhagavad Gita. Please do not bring any other topics or politics or other sadhana in this satsang. Focus on yoga and encourage each other.
5. సాధన: ఒక గంట - Sadhana: One hour
6. హారతి మరియు ప్రసాదం - Harati and Prasad



How to do Yogam - యోగము చేయు సాధకులకు ఉపయోగపడు కొన్ని సూచనలు

1 . టీ త్రాగరాదు. కాఫీ/ కెఫిన్ వంటివి తగ్గించుకోవలెను
Do not drink tea/Chai. Coffee/caffine should be reduced.

2 . రాత్రి సమయంలో పెరుగు/ మజ్జిగ వాడరాదు. పూర్తిగా తగ్గిచ్చెయ్యండి. ఇవి కఫ కారకాలు.
Yoghurt/buttermilk should not be consumed at night. Reduce completely. These cause phelm.  

3. గోరువెచ్చని జీలకర్ర నీటిని త్రాగుట మంచిది. ( ఒక టీస్పూను జీలకర్ర ను ఒక లీటరు నీటిలో మరగించినచో జీరా నీరు తయారగును) యోగం చేసేకొద్ది Pituitary and hypothalamus ki energy increase అయి దాహం తగ్గుతుంది.
It is better to drink lukewarm cumin water. (Cumin water is made by boiling a teaspoon of cumin in a liter of water.) As you do more and more yogam, pituitary and hypothalamus receive more energy thereby reducing your thirst.

4 . రాత్రి పెందలకడనే భుజించండి (7 - 8 గంటలకు ముందు). Eat early at night (before 7 or 8). నిషేధం దొండకాయ, ఉల్లి, వెల్లుల్లి, అతి కారం, ఉప్పు, అతి పులపు, అతి వేడి, చల్లని పదార్థములు. Avoid tindora, onion, garlic,. Avoid very spicy, salty or sour and very hot or cold foods.

5. కఠినమైన ఉపవాస దీక్షలు చేయరాదు. అతిగా భుజించరాదు. రాత్రిపూట అన్నము బదులుగా చపాతి లేదా పుల్కా తినినచో యోగముకు మంచిది.
No strict fasting in the name of devotion should be done. Do not overeat. Eating tortilla, chapati or pulka made of wheat instead of rice at night is good for yogam.


6. యోగము మరియు ధ్యానము సాధన చేయుటకు, త్వరగా నిద్రించి, త్వరగా మేల్కొనవలెను. (నిద్ర రాత్రి 9 గంటల నుండి 3 గంటల మధ్య ఉండునట్లు చూసుకోవలెను) For yogam and meditation practice one should sleep early and wakeup early. (Regulate your sleep time to be between 9PM through 3AM)

7. భోజనం తరువాత మొదట్లో 2 గంటలు గాప్ ఉంచుకోండి. అలవాటు అయిపోయాక గాప్ అక్కర్లేదు. Keep a gap of 2 hours initially after meals. Once you get used to yogam gap is not needed.

8. తక్కువగా మాట్లాడండి. Speak less.

9. ఏ కారణం చేతనైనా యోగమును ఒక రోజు తప్పించుట లేదా వదలి వేయుట చేయరాదు. Yogam should not be skipped even a day for any reason.

10. ఈ క్రింది లింకులలో ఉన్న వివిధ పుస్తకములు/ వీడియోలు /ఆడియోలు చదివి /విని జ్ఞానమును పెంపొందించుకోగలరు. You can increase your knowledge by reading / listening to various books / videos / audios in the following links.

Important: Must Read - Book in Telugu
యోగము- ధ్యానము - జ్ఞానము పుస్తకము http://antarmukhananda.org/Documents/YDJ.pdf

తెలుగు పుస్తకములు
http://antarmukhananda.org/Telugu-Books.html

ఇంగ్లీషు పుస్తకములు
http://antarmukhananda.org/English-Books.html

Youtube Channel - Subscribe and share
https://www.youtube.com/c/ANTARMUKHANANDACHANNEL



యోగం చేయు విధానం : How to do Yogam?


1. తూర్పు or ఉత్తరం దిశ కూర్చోండి. Sit facing east or north.

2. ఆసనం పద్మాసనం or any that is comfortable. Seating cross legged in padmasan or any sitting position that is comfortable.

3. పరిసరాలని శుచిగా శుభ్రముగా ఉంచుకోండి. Keep your sourroundings clean.

4. చిన్న కుషన్ ఒక చెక్క పీట మీద వేసుకొని, తెల్లని వస్త్రమును వేసుకోండి. Place a small cushion of a wooden seat. Cover it with a white folded cloth.

5. యోగం పీట చేయించుకోవాలి అంటే కొలతలు 3' x 2' x 3". If you like have seat made, the dimensions are 3' x 2' x 3".

6. దీపం వెలిగించాల్సిన అవసరము లేదు. No need to light lamp or incence.
ఓం శ్రీ గురుభ్యో నమః అని ఆత్మ నమస్కారము చేసుకొని మొదలు పెట్టవలేను. Start by doing atma namaskaram saying "Om Shree Gurubhyo Namaha"

7. చేతిలో చిన్ముద్ర , కళ్ళు ఖేచరి ముద్ర పెట్టి యోగం చేయవలెను. Make sure you have chinmudra in your hands and eyes in khechari mudra.

8. యోగం లో ధ్యాస ప్రాణాయామం 'శబ్దం' మీద, ధ్యానం లో ధ్యాస 'శ్వాస' మీద పెట్టుకొనవలెను. During yogam your focus is on sound of friction, in meditation focus on breath. No matter how long you do yogam, meditation is only for 10 mts.

9. అయిపోయాక ఓం శ్రీ గురుభ్యో నమః అని ఆత్మ నమస్కారము చేసుకొని లేచిపోవలెను. After yogam is done come off by saying "Om Shree Gurubhyo Namaha".

10. రోజు అంతా అంతర శ్వాస మీద ఉండండి. All throughout the day keep your attention on breath going up and down internally like you are doing yogam. But make sure no one else hear the yogam sound, and please do not turn your eyes up. You can do this during cooking, at work and at any time possible.

ఓం తత్ సత్

సాదన కు ఉపయొగపడే విడియో లు

1. గురు అనుగ్రహం ఎలా వస్తుంది?

2. యోగ సాధన ఎలా చెయ్యాలి? 

3. ఆహార నియమాలు?

4. యోగి ఆహార రహస్యం - Science of Upavas 

5. నాసాభ్యంతర చారిణౌ- ఇది తెలియకయే లోకమంతా అపమార్గములో సంచరించుచున్నది

6. ఎవరిని వారుఉధ్ధరించు కొనుట అనగానేమి?

7. సర్వం ఖల్విదమ్ బ్రహ్మ - కూటస్థుడు ఎప్పుడు అవుతాడు?

8. ఆత్మ సాక్షాత్కారం వివరణ -సాధకునికి గుప్త జ్ఞానం-కళ్ళు ఎందుకు పైకి పెట్టాలి?

9. ప్రతి సాధకునికి ఈ ఆహార విహార మర్మములు తప్పనిసరిగా తెలియాలి?

10. ఈ కీలకం తెలిసిన వారే యోగులు - తదితరములన్నియూ మోక్షము నీయలేవు

11. ఇంతకంటే సుఖం మరిఒకటి లేదు

12. సాధనలో మనస్సుని ఎలా స్వాధీనము చేసుకోవాలి? మనస్సుని ఆత్మ యందు ఎలా నిలపాలి? 

13. మనసు ఎందుకు కదలుచున్నది?అదుపు చేయుట ఎట్లు? శ్రీ క్రృష్ణ పరమాత్మ ఏమిచెప్పారు?