Soura Yogam
ఉదయం
ప్రతీరోజూ సూర్యోదయమైన అరగంట వెంటనే ప్రారంభించవలెను. మొత్తం
కార్యక్రమం అరగంటతో పూర్తవుతుంది. సూర్యుడు ఏ కారణం చేతనైనా మబ్బుల వలన
గానీ మంచువలన గానీ కనిపించకపోయిననూ కేవలం తూర్పు వైపున వెలుతురు
ఉన్నాసరే ఫలితం వచ్చును.
సాయంత్రం
వేళల్లో కూడా సూర్యాస్తమయం అరగంట సమయంలో పూర్తగుతుందనగా
ప్రారంభించవలెను.
సూర్యుడు
తగిలే స్థలము, మేడ మీద లేక
గదిలో కానీ,
చాప లేక బొంత
15
నిమిషాలు పడుకునే వీలుగా వేసుకొని
యు ట్యూబ్
లో
చూడండి.
మేడ మీద
బొంత పై 15
నిమిషాలు కూర్చుని తరువాత10
నిమిషాలు పడుకుని చెప్పిన
ప్రకారం చేయవలెను.
మగవాళ్ళు. చొక్కా బనీన్లను తీసి వేసి వీలయినంత శరీరభాగాన్ని సూర్యకాంతితో
నిండునట్లు కూర్చొనవలెను.ప్రాణాయామం
వచ్చినవారు మొదటి 15
నిమిషాలు చేస్తూ సూర్య బింబాన్ని తన భ్రూమధ్యంలో కనబడకుండా ఉంచుతూ
తెల్లగ్రుడ్డుమాత్రం సూర్యకాంతికి తగులునట్లు చూడవలెను. స్రృష్టిలో మన
తెల్లగ్రుడ్డు మరియూ గోమాత రంటం(సూర్య. కేతు నాడి) మాత్రమే సూర్యుని
శక్తిని గ్రహించగలవు.
ప్రాణాయామం తెలియని వారు కూడా ఈ సౌరయోగాన్ని చేసుకొనవచ్చును.
మిగిలిన
విధివిధానాలను వీడియోలో విని చేయగలరు.
ఫలితములు మీ
మొదటి దిన సాధనతోనే ప్రారంభించును.
ఎట్టిపరిస్థితుల్లోనూ సూర్యబింబాన్ని ప్రత్యక్షంగా చూడరాదు. సౌరయోగం
వలన చాలా రుగ్మతలు తొలగును.
గురూజీ
సౌర యోగం ఎలా చెయ్యాలి ?
ఓం శ్రీ గురుభ్యోనమః
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై
శ్రీ గురవే నమః
ఓం నారాయణ సమారంభాం శ్రీ శివానంద మధ్యమాం
శ్రీ రామానందావధిమహం వందే గురు
పరంపరాం
యోగాభ్యాసం సమారంభే మోక్ష
సామ్రాజ్య దాయినం
ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం
నిధయే సర్వవిద్యానాం శ్రీ
దక్షిణామూర్తయే నమః
ఓం బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞాన మూర్తిం
విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది
లక్ష్యం
ఏకం నిత్యం విమలమచలం సర్వధీ
సాక్షిభూతం
భావాతీత త్రిగుణ రహితం సద్గురుం
తం నమామి
ఓం భగవతే సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మణే నమః
ఓం భగవతే సద్గురు శ్రీ శివానంద
పరబ్రహ్మణే నమః
ఓం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ
నందనాయ చ
నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః
ఓం వసుదేవసుతం దేవం కంస చాణూర
మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే
జగద్గురుం
ఓం కృష్ణం
కమల పత్రాక్షం పుణ్య శ్రవణ
కీర్తనం
వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణ
హరిం
ఓం భగవతే శ్రీ కృష్ణ పరమాత్మనే
నమః
ఓం లోకోద్ధరణార్థం అద్వైత
స్థాపకాయ నమః
శ్రీమఛ్చంకర భగవత్పాదాచార్య
సద్గురువే నమః
వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం
తపోనిధిం
సౌర యోగము అందరికీ ఉపయోగపడేది. ఆధ్యాత్మికపరంగా, ఆరోగ్య పరంగా కూడా చాలా ఉపయోగపడే ఈ సౌర యోగాన్ని మీకందరికీ, ప్రాణాయామము చేసిన వాళ్ళకి, చేయనివాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఈ సౌర యోగం ఏమిటంటే, ప్రతి రోజు శుభోదయం సమయానికి అరగంట తర్వాత ప్రారంభించాలి. ఒకవేళ మబ్బులు గాని, మంచుగాని ఉన్నప్పటికీ కూడా తూర్పువైపు తిరిగి, ఆ తెల్లని వెలుతురు ఉంటే చాలు, అందులో ఆ ఊర్జ, సూర్యశక్తి ఊర్జ, ఆ ఊర్జను మనం శరీరంలోకి తీసుకోవచ్చు. ఈ సూర్యుని శక్తిని, ఊర్జని గ్రహించేవి సృష్టిలో రెండే రెండు ఉన్నాయి. మన తెల్లగుడ్డు, గోమాత యొక్క మూపురం. మూపురంలో సూర్య కేతు నాడి ఉంటుంది. ఆ సూర్య కేతు నాడి గ్రహించి, దేశవాళి గోమాత, కామధేనువు, సురభి వీరంతా ఆ సంతతివారు, అక్కడినుంచి ఆ సూర్యశక్తిని గ్రహించి గోమాత పాలలో మనకి ఇస్తుంది. అలాగనే మనం డైరెక్ట్ గా ఈ సూర్యశక్తిని స్వీకరించవచ్చు. మనం తీసుకునే ఆహారం అంతా కూడా సౌరశక్తి మాత్రమే. అది పరోక్షముగా గ్రహించే శక్తి. మనం లోపలకి తీసుకు వెళ్లి జఠరాగ్ని ద్వారా పచనం చేయించి, ఆ శక్తిని మళ్ళీ శరీరానికి, మెదడుకు ఇస్తున్నాం. ఇక్కడ ఏమిటంటే, డైరెక్టుగా కళ్ల ద్వారానే మన మెదడుకు ముందు వెళ్తుంది. తర్వాత క్రింది భాగానికి కూడా పంపిస్తాం. ఈ సౌర శక్తి అనేది దీని పేరు ఊర్జ అంటారు. ఊర్జ అంటే శక్తి. దీన్ని మొట్టమొదట నేను ప్రారంభిస్తున్నాను.
ఓం భాస్కరాయ విద్మహే
మహాధ్యుతికరాయ ధీమహి
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్
ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహి
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్
ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమ ధీమహి
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్
ఓం మిత్రాయ నమః
ఓం రవయే నమః
ఓం సూర్యాయ నమః
ఓం భానవే నమః
ఓం ఖగాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం హిరణ్యగర్భాయ నమః
ఓం మరీచాయ నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం సవిత్రే నమః
ఓం అర్కాయ నమః
ఓం భాస్కరాయ నమః
సూర్యశక్తిని మన కళ్ళ యొక్క తెల్లగుడ్డు ద్వారా గ్రహించి, శరీరంలోని అన్ని భాగాలకు పంపించడం దీనిలోని ముఖ్య ఉద్దేశ్యము. ఈ సౌర యోగము విధి విధానము ఏమిటంటే, మనము సూర్యబింబాన్ని చూడకుండా, మన దృష్టిని భ్రూమధ్యములో అలా పెట్టి, ఇంకా మీదకు పెట్టి, ఆ బింబము భ్రూమధ్యము మధ్యలో తెల్లగుడ్డుపై పడేటట్లు అలా చూస్తూ ఉండాలి. ప్రాణాయామము తెలిసినవాళ్లు ప్రాణాయామము చేసుకోండి. ప్రాణాయామము తెలియని మిగతావాళ్ళు అందరూ కూడాను దృష్టి అలాగే పెట్టుకోవాలి. ఈ కనుబొమ్మలు రెండు కలిసేటప్పుడు ఎక్కడైతే ఉందో, అక్కడ దానిపైన సూర్యబింబం ఉండాలి. ఈ కాంతి మాత్రం తెల్లగుడ్డు పైన, sclera పైన పడుతూ ఉండాలి. ఇలాగ 15 నిమిషాలు మనం చూడాలి. ఈ చూసేటప్పుడు కొద్దిగా కళ్ళనీళ్ళు కూడా వస్తాయి. ఏం పర్వాలేదు. దీనివల్ల కళ్ళ రోగాలు అన్ని తగ్గిపోతాయి. ఇలాగ చూస్తూ ఉండగా, మనం ఈ పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత, ఈ కళ్ళపైన చేతులు ఎలా రబ్ చేయాలో చూపిస్తాను.
రెండు అరచేతులు రాపిడి చెయ్యాలి.
రెండు అరచేతులు రాపిడి
చేసేటప్పుడు,
మొట్టమొదట రెండు బొటన వ్రేళ్ళు
పార్శ్వ భాగాన్ని రుద్దాలి / రబ్ చేయాలి. పార్శ్వ భాగము అంటే ఇది (ఇది
గురూజీ చేసి చూపించారు .. 12.21).
ఇలా రబ్ చేస్తే వేడి
వస్తుంది. బాగా వేడి వస్తుంది.
ఆ వేడిని మనము,
ఇక్కడ కళ్ళు మూసి
చూపిస్తాను అది,
ముందు
demonstrate
చేస్తున్నాను.
ఈ ముక్కు దగ్గర్నుంచి
కళ్ళను మూడుసార్లు నిమిరి (గురూజీ చేసి చూపించారు ..
12.36)
చెవులు వైపు,
అంటే ఇటువైపు,
మళ్లీ నిమరడం ఇలా మూడు
సార్లు,
మళ్లీ రబ్ చేయడం,
అలాగున ఇది ఆరు సార్లు
చేయాలి.
ఇది,
బొటనవేలు,
అగ్ని తత్వం.
తరువాత చూపుడువేలుతో రబ్
చేయాలి. ఇది కూడా ఇక్కడ పెట్టి కంటి పైన ఇలా చేయాలి (గురూజీ చేసి
చూపించారు .. 12.55). ఈ
విధంగా మూడుసార్లు చేస్తూ,
రబ్ చేస్తూ ఆరుసార్లు,
అంటే ఆరు సార్లు రబ్
చేస్తూ ఉండాలి,
ప్రతిసారి ఇలా కళ్ళ పైన
మూడుసార్లు నిమరాలి.
రిపీట్ చేసేది ఆరుసార్లు చేయాలి.
తరువాత ఇలా పెట్టి చేయాలి.
మూడోది ఏమిటంటే,
ఇలా పెట్టి బాగా రబ్ చేసి
చూపుడు వేలుతోన ఇలా బొటనవేలు గడ్డం దగ్గర పెట్టి,
కళ్ళు మూసుకుని చూపుడు
వేలుతో ఇలా చేసిన తర్వాత (గురూజీ చేసి
చూపించారు .. .13.18),
రబ్ చేయడం ఆ అగ్నిని ఆరు సార్లు,
అంటే బొటనవ్రేలు ద్వారా
ఆరు సార్లు,
చూపుడువేలు ద్వారా ఆరు సార్లు
(మొత్తం 12
సార్లు).
ఇలా చేసి మన కళ్ళకు అప్లై
చేయాలి ఆ వేడిని.
బాగా వేడెక్కుతుంది.
మనం ఇలా అప్లై చేశామంటే
ఏమవుతుందంటే,
కంటికి లోపల సర్కులేషన్ పెరగడమే
కాకుండా ఇంతవరకు మనం ఆశ్వాదించిన
సౌరశక్తి అంతా కూడా,
అది మెదడుకు వెళుతుంది.
ఆ తర్వాత
మనము ఏమి చేయాలంటే,
ఈ
పదిహేను నిమిషాలు అయిన తర్వాత మనము పడుకోవాలి.
సూర్యునికి ఎదురుగా కాళ్ళు
పెట్టి మనము పడుకోవాలి.
కాళ్ళు పెట్టి పడుకున్న తర్వాత,
ఈ మూర్ద్ని
స్థానం,
సహస్రారం,
ఇక్కడ నుంచి మనము శరీర
భాగాలను స్మరించుకుంటూ పోవాలి. అప్పుడు
నేను రన్నింగ్ కామెంటరీ ఇస్తాను.
పైనుంచి క్రిందకు,
కుడి ఎడమ భాగాలను
స్మరించుకుంటూ,
స్మరించడం అంటే ఏమిటంటే,
మనము ఏ భాగాన్ని
స్మరిస్తామో,
మనము ఇప్పటివరకు సంపాదించిన ఆ
సౌరశక్తి ఆ భాగానికి వెళుతుంది.
మనసు ఎక్కడ ఉంటే శక్తి
అక్కడకు వెళుతుంది. సంకల్పం కదా.
కాబట్టి మనసును అక్కడ
పెడితే అక్కడకు ఆ శక్తి వెళుతుంది. మనము ఈ లోగా,
మనకి ఏ భాగాలలో
రోగాలు ఉన్నాయో,
అంటే మనకు జబ్బులు ఉన్నాయో,
ఉదాహరణకు షుగర్ ఉంటే
ప్యాంక్రియాస్;
అలాగనే లివర్ జబ్బు ఉంటే లివర్;
ఊపిరితిత్తులకు ఉంటే
ఊపిరితిత్తులలోన;
తరువాత చెవిపోటు ఉంటే చెవి;
కన్ను సమస్యలు ఉంటే కన్ను,
ఇలా మనకు ఏ భాగములో రుగ్మత
ఉందో అక్కడ ఎక్కువ సేపు కాన్సెంట్రేట్ చేయాలి.(15.02)
అలా చేస్తూ,
ప్రతి భాగము స్మరించుకుంటూ,
క్రిందకి అరి పాదము (sole
of the foot) అంత వరకు
కూడా కుడి ఎడమలు నేను చెప్తూ ఉంటాను,
అవి స్మరించుకుంటూ
వెళతారు.
మరల మీరు పై వైపుకు వస్తారు.
అంటే అరిపాదం నుంచి ప్రతి
భాగాన్ని స్మరించుకుంటూ మరల మూర్ద్ని స్థానం,
మాడు,
తల మాడు వరకు వస్తాము.
ఈ విధంగా పై నుంచి
క్రిందకి,
క్రింద నుంచి పైకి అలా మూడుసార్లు
చేసుకుంటూ,
ఆ చేసినపుడు,
మనం
వెల్లకిలా పడుకునేటప్పుడు,
ఈ పెద్ద వేలు,
మధ్యవేలు,
మన బొడ్డు దగ్గర
ఇరువైపులా పెట్టుకొని,
మిగతా వేళ్లు కడుపుకు
ఆనించి (గురూజీ ప్రతిదీ చేసి చూపుతున్నారు ..
వీడియోలో గమనించగలరు)
పడుకోవాలి.
అలాగా మనము అది పది నిమిషాలు
చేస్తాము. ఇప్పుడు మనము సూర్యుని శక్తిని గ్రహించేది పావుగంట.
పావుగంట తరువాత ఆ పడుకొని
చేసేది
పది నిమిషాలు.
అంటే ఇదంతా కూడా (పైనుంచి
క్రిందకు,
క్రింద నుంచి పైకి మూడు సార్లు
శక్తి ప్రసరణ) మూడు,
నాలుగు నిమిషాల్లో అయిపోతుంది అలా
స్మరిస్తూ ఉండడం.
తర్వాత అంతా కూడా రెస్ట్
తీసుకుంటాము అలాగనే. అప్పుడు
కూడాను ప్రాణాయామము,
శ్వాస ఏదైనా మీరు చేసుకోవచ్చు.
ఈ పడుకునే సమయంలో కొంతమందికి
నిద్రపట్టి మంచి రిలాక్సేషన్ వస్తుంది.
గురక పెట్టేవి ఏమైనా ఉంటే
అవి కూడా వచ్చేస్తాయి.
ఏమైనా వర్రీ అవ్వద్దు.
ఇది అయిన తరువాత, లేచిన
తర్వాత ఒకసారి చేతులు రబ్
చేసి,
పూర్తిగా రబ్ చేసి,
అది మొత్తం ముఖమంతా కూడా
పామి,
పై నుంచి క్రిందకి తీసుకొని
పామాలి శరీరమంతాను.
మనం ఈ వేళ్ళు గాని,
అరచేతులు గాని ముఖం పైన
మనం రుద్ద్దేటప్పుడు అనేక రంగులు మనకు కనబడుతుంటాయి.
ముఖ్యంగా ఆరెంజ్ రెడ్,
వంగపండు రంగు,
కళ్ళు నొక్కినపుడు వంగపండు
పసుపు,
తర్వాత మనం పడుకొని లేచి మళ్లీ
రబ్ చేసినప్పుడు ఎరుపు,
దానికి ఎదురుగా
డార్క్ బ్లూ కనబడుతుంది.
ఇంకా ఇవే కాకుండా మనకు
అనేక
రకాల అంతర్దర్శనాలు జరుగుతుంటాయి.
అంతర్దర్శనాలు అంటే మన
సృష్టిలో కొంత మంది ఋషులు కూడా కనబడతారు. తర్వాత మనకి అనేకమంది రూపాలు
త్వర త్వరగా,
త్వర త్వరగా వచ్చి కనబడి
వెళ్ళిపోతుంటాయి.
మనము ఎక్కువగా ఎవరిని బాగా
స్మరిస్తూ ఉంటామో వారు కూడా కనపడుతూ ఉంటారు.
ఆ మహర్షులు వాళ్లు కూడాను.
అంతేకాకుండా
మీరు ఈ
ప్రాణాయామము చేసే వాళ్ళు అయితే,
బాగా ప్రాణాయామం చేస్తే ఇక్కడ ఈ భ్రూమధ్యంలోనుంచి చిచ్చుబుడ్డి,
చిచ్చుబుడ్డి మనం
వెలిగిస్తే,
ఆ వెలిగించినప్పుడు పువ్వులు
వస్తాయి చూశారా!,
పువ్వుల మాదిరి,
బంగారు పసుపు రంగు
పూలుమాదిరిగాను మనకు భ్రూమధ్యంలో కనబడుతుంది.
బాగా సాధన చేస్తే అది
కనబడుతుంది.
అది ఎక్కడ నుంచి కనబడుతుంది అంటే,
మన సుషుమ్నాలో నుంచి పైకి
వెళ్లేటప్పుడు ఆ ఊర్ధ్వ సుషుమ్నా అంటే మనకు మెడికల్ గా ఏమిటంటే, fourth
ventricle పైన, aqueduct
of sylvius పైన ఒక రంధ్రం
ఉంటుంది.
ఆ రంద్రమే మనము నిత్యము
చెప్పుకుంటున్నది,
అది ఏమిటంటే third
ventricle లోకి వెళ్లి
ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అవుతుండేటప్పుడు,
ఈ ప్రాణశక్తి ఆ
రంధ్రంలో నుంచి third
ventricle కు
వెళ్లేటప్పుడు,
ఇక్కడ ఈ భ్రూమధ్యంలోన
ఈ కళ్ళలో కనబడుతుంది,
ఫౌంటెన్ లాగా,
ఇలాగా ఉండి ఉండి,
ఉండి ఉండి కనబడుతుంది. (18.48)
అది
that is very important.
అందువల్ల
ఆదిత్య హృదయం అంటే,
బయట
సూర్యుడు,
లోపల మన ప్రాణమే ఈ ఆదిత్యుడు.
ఈ ఆదిత్య హృదయం అంటే
ఏమిటంటే,
ప్రాణాయామము చేసినవాళ్లు తన
ప్రాణాన్ని పైకి కిందకి మర్దన చేస్తూ,
ఇక్కడ నుంచి మీదకు తీసుకు
వెళ్లే దానిపేరే ఆదిత్య హృదయం.
అదే అగస్త్య మహర్షి
శ్రీరామచంద్రునికి ఉపదేశము చేశారు.
అది ఉపదేశము అయిన తర్వాతే
రావణాసురుని చంపినట్లు మనకు రామాయణంలో ఉంది.
ఆ చంపడం ఏంటంటే ఇదే.
మనలోన ఈ ప్రాణశక్తి
క్రిందకి వెళుతుంటే దశేంద్రియాలతో కూడిన ఈ జీవుడు,
ఆ శక్తిని తీసుకునే జీవుడు
అయిపోయాడు.
అటువంటి దశకంఠుడుని,
ఆ జీవుడిని,
ప్రాణశక్తిని మీదకు తీసుకు
వెళ్తే అవన్నీ సంహరింపబడి,
ఆ శక్తిని తీసుకుపోతాడు రాముడు.
రాముడు ఇక్కడకు (గురువుగారు భ్రూమధ్యం చూపించారు) తీసుకుపోతాడు.
దానికే సేతుబంధనం చేశారు.
ఆ సేతుబంధనం ఏమిటంటే,
మన ప్రాణం కొంతదూరం వెళ్ళి
వచ్చేస్తోంది,
మనం ఇప్పుడు మీదకు ప్రాణాయామం
చేస్తూ ఉంటే,
వాయువు ద్వారా,
ఆంజనేయస్వామి ద్వారా,
ఇక్కడకు
(గురువుగారు భ్రూమధ్యం
చూపించారు) తీసుకెళ్లి,
ఇక్కడ లంక,
లంక అంటే ఆ లంక కాదు,
లం .. క,
క అంటే ఆకాశం,
లం అంటే ప్రకాశం.
కాబట్టి చిదాకాశం దగ్గర
నుంచి ప్రకాశం కిందకు వెళ్లిపోయింది,
ఆ క్రిందకు వెళ్లిపోయిన
శక్తిని వాయువు సహాయం చేతను ఇక్కడకు (గురువుగారు భ్రూమధ్యం చూపించారు)
తీసుకువెళితే మనలో ఉండే రావణత్వం,
ఈ దశకంఠుని తాలూకా
జీవతత్వం పోయి,
ఈ శక్తిని ఇక్కడకు తీసుకు వెళ్తే
అప్పుడు మనము పరబ్రహ్మ స్వరూపులము అవుతాము. ఇది
రామాయణం. ఇదే ఆధ్యాత్మ
రామాయణం.
ఈ విధంగా
ప్రతి ఒక్కరు కూడా తనలో ఉండే ప్రాణశక్తిని ఈ విధంగా పై నుంచి క్రిందకి,
క్రింద నుంచి పైకి కూడా మర్దన
చేస్తూ ఉండాలి.
మర్దన చేస్తేనే సూక్ష్మాతి
సూక్ష్మమైన శక్తి బయట పడుతుంది.
ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన
ప్రాణశక్తే హిరణ్యగర్భుడు.
అంటే బంగారు వర్ణంతో ఉంటాడు. (21.27)
ఆ
బంగారు వర్ణాన్ని మనలో
రోజు చూస్తూ ఉంటే,
మనలో ఈశ్వరత్వం వృద్ధి చెందుతూ
(డెవలప్ అవుతూ) ఉంటుంది.
ఈశ్వర తత్వం ఎప్పుడు ఎక్కువ
అవుతుందో అప్పుడు జీవుడి తాలూకా బ్రాంతి లక్షణాలు తొలగిపోతుంటాయి.
ఇంతవరకు ఊహించిన ఈ భ్రమలు,
తర్వాత పూర్వజన్మల కర్మలు,
కర్మ సిద్ధాంతము,
తర్వాత అనేక పాపాలు,
పుణ్యాలు,
ఇవన్నీ కూడా ఏమిటంటే,
మనము క్రింద ఉండేటప్పుడు
కల్పించుకున్నవి,
అవి అన్నిని.
కల్పించుకోవడం అంటే,
మన శక్తి తగ్గినప్పుడు
ఆటోమేటిక్ గా
ఆ కల్పనలు వస్తాయి.
మనము ఇప్పుడు మీదకు
వెళ్తుంటే,
ఇదంతా కూడా ఒక భ్రమ అని మన శక్తి
ద్వారా,
మన జ్ఞానం ద్వారా,
మన ఆనందం ద్వారా మనకు మనమే
తెలుసుకుంటాము.
దీని పేరే
self realisation. Self realisation అంటే
నిన్ను నీవే తెలుసుకోవడం.
అంతవరకు ఏమిటంటే,
ఎదురుగా ఉన్న ఈశ్వరుడు
ఎక్కడో ఉన్నాడని,
తర్వాత ఎదురుగా గురువు ఉన్నారని
భావన వుంటుంది.
ఆ తర్వాత ఆత్మగురుడే తన లోపల
ఉంటాడు.
ఆ ఆత్మగురుడే "నేను" . ఈ ఆత్మ
గురుడే
నేనని మనం తెలుసుకుంటాం.
ఈ ప్రాణాయామం చేసినపుడు మొట్టమొదట, క్రింద నుంచి పైకి వెళుతున్నప్పుడు ముందు సామీప్యం. ఇక్కడ ఆత్మ స్థానానికి దగ్గరగా వెళ్లేటప్పుడు మనం సమీపం అవుతున్నాము. ఆ సమీపం అయిన తర్వాత దగ్గరికి వెళ్తే ఆ బ్రహ్మ తేజస్సును మనం చూస్తాం. అప్పుడు దాని పేరు సాలోక్యం అంటారు, ఆ సాలోక్యం అయిన తరువాత మనము ఇంకా ఎక్కువ చేస్తుంటే మనం చూసే వాడు, ఆ చూడబడే తేజస్సు ఈ రెండూ సమానమౌతాయి. అంటే ఏంటంటే చూడబడే ఈ యావత్ సృష్టి అంతా తేజోమయమని, తరువాత తాను కూడా తేజస్సు అని గ్రహించుకుని అప్పుడు సారూప్యం చెందుతారు. సారూప్యం అంటే ఏమిటంటే, నేను, నా ఎదురుగా ఉండే యావత్ సృష్టి రెండు కూడా ఒకటే, అది ఇది ఒకటే అనే భావనతో ఉంటాడు, సారూప్య స్థితిలోకి వెళతాడు. ఆ తర్వాత చూసేవాడు, చూడబడేది ఏకమయిపోయి సాయుజ్యం చెందుతాడు.
మన పరమ
గురుదేవులు,
మన
గురువు గారు,
వారిద్దరూ మహాత్ములు.
మన గురువులు యుగపురుషులు
అటువంటి మహాత్ములు,
ఈ ప్రాణశక్తిని,
మన గురువు గారు,
బ్రహ్మర్షి సద్గురు శ్రీ
శ్రీ శ్రీ స్వామి రామానంద పరమహంస వారు,
మన పరమ గురువులు
బ్రహ్మర్షి సద్గురు శ్రీ శ్రీ శ్రీ శివానంద పరమహంస వారు వీరిద్దరూ కూడా,
ఈ సృష్టి రహస్యాన్ని,
ఇదివరకే ఋషులు
కనిపెట్టింది,
ఋషులు చేసింది,
శ్రీ కృష్ణ పరమాత్మ
చెప్పిన భగవద్గీతలో సారాన్ని వారు బహిర్గతం చేశారు. (24.14)
ఇప్పుడు నేటి లోకానికి
ఏమిటంటే ఈ యోగ విద్యయే సర్వము అనేది శాస్త్ర ప్రమాణముగా రుజువు చేసిన
మన యుగపురుషులు ఎవరంటే మన గురుదేవులు,
పరమ గురుదేవులు.
అది తెలియనంతవరకూ
ఏమవుతుందంటే, అనేక రకాలుగా
అపార్ధాలతోన మనకు ఇన్ని రకాలుగా యోగాలు అన్ని వచ్చాయి.
ఈ యోగాలు కూడా గ్రంథాలలో
ఉన్నాయి.
హఠయోగము పేరిట చాలా రకాలుగా
ఉన్నాయి ఇవన్నీని. కానీ
వాటిని పిండి,
వడగట్టి చెప్పే గురువులు,
మహాత్ములు ఎవ్వరు దొరకలేదు
ఇంతవరకు.
మరలా మన గురు పరంపర,
అలాగనే ఉత్తర భారతదేశంలో
మహావతార్ బాబాజీ యొక్క క్రియాయోగ పరంపర,
మన దక్షిణ భారత దేశంలోన మన
పరమ గురుదేవులు శ్రీ శివానంద పరమహంస వారు,
స్వామి రామానంద పరమహంస
వారిద్వారా ఈ సిద్ధ యోగ పరంపర అనేది మనకి ఇప్పుడు వ్యాప్తం అవుతున్నది.
ఏ పరంపర అయినప్పటికీ కూడా,
చెప్పేది అంతా కూడా, దాని
తాలూకా సారం ఒక్కటే.
విధానం ఒక్కటే.
కాకపోతే చిన్న చిన్న
తేడాలు ఉన్నప్పటికీ కూడా దానిని మనము లైవ్ గా ఎక్కడైతే మనము సాధన ఎవరు
చేస్తున్నారో బాగా,
అలాగే గురువుగారి బోధని
అవగాహన
చేసుకొని,
ఆకళింపు
చేసుకొని ఉన్నారో వాళ్ళ
ద్వారా వింటే మీకు ఈ సకల శాస్త్ర సారము అంతా కూడా స్పష్టంగా
అర్థమవుతుంది.
దైవము అనేది అది ఎక్కడో
ఉన్నదనుకొని,
మనము చాలా బాధపడి,
ఎన్నో రకాలుగా
ప్రయత్నంచేసి అగమ్యగోచరంగా ఉన్నాము.
కానీ దైవము అనేది ఏమిటంటే
నీ ప్రాణమే.
ఈ ప్రాణం అనేది బహిర్గతముగా వచ్చి,
బయటి వాయువుతో కలవడం వలన
మనం మాయలో పడ్డాము.
మనం ఇప్పుడు ఏమిటంటే ఈ
ప్రాణాయామము చేస్తూ ఉండగా,
బయటి వాయువు సంచారము రానురాను
తగ్గుతూ ఉండి,
నీ ప్రాణాన్నే నీవు
తెలుసుకుంటావు.
అప్పుడు నీ ప్రాణం కంటే అన్యముగా
ఏమీ లేదు. సర్వం ప్రాణమయం జగత్.
ఈ ప్రాణమే సర్వమును.
అందువల్ల ఏమిటంటే,
ఆ స్థితికి చేరడానికి
పునాది ఏమిటంటే ప్రాణాయామము.
ప్రాణాయామం అనేది ఒక మెకానికల్ గా,
ఫిజికల్ గా చేసే ఒక
బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కాదు.
ఇది ఆధ్యాత్మిక ప్రగతిసాధన.
ఈ సాధన వల్లనే మనలో
కోల్పోతున్న మన శక్తిని,
జ్ఞానాన్ని,
ఆనందాన్ని,
ప్రకాశం అన్నిటిని కూడా
తిరిగి మనం పొందుతుంటాం.
అలా పొందుతూ ఉండేటప్పుడే మన
ఈశ్వరత్వం లభ్యమవుతుంది.
ఈశ్వరత్వం ఎప్పుడో కాదు,
నీ మొదటి శ్వాస నుంచే.
నీ ప్రాణం పైకి వెళ్ళడం
ప్రారంభించిన దగ్గరనుంచే ఈశ్వరత్వం ప్రారంభమవుతుంది.
మనకి
భ్రూమధ్యంలోన ఆరెంజ్ రెడ్ గా,
ఆరెంజ్
కలర్ లో ఉంటూ లోపల బ్లూ గా కనబడుతుంది.
లోపల ఒక వినీల ఆకాశం,
నీలి ఆకాశం ఉన్నట్టు
కనబడుతుంది. కనుబొమ్మల బోర్డర్ లోన ఆరంజి,
మెజంతాకలర్ దానిపైన ఒక
బ్లూ గా కనబడుతుంది. ఆ బ్లూ లోనే మన ప్రాణ శక్తి అనేది మనకి,
మనం చూసుకునే ఆ
platform
అది. ప్రాణాయామం చేస్తుంటే ఆ
సుషుమ్నలోనుంచి,
పైనుంచి,
ఆ వెనుక నుంచి వెళుతున్న
ప్రాణశక్తి అనేది ఈ భ్రూమధ్యంలో ఇక్కడ స్పష్టంగా చూడగలం.
అది నిరంతరం
observe
చేయాలి.
సాధన చేసి
observe
చేస్తుంటే అది ఇలా వచ్చి తెరలు
తెరలుగా,
చిచ్చుబుడ్డి లాగా వచ్చి వెళ్లి
పోతుంటుంది.
యోగీశ్వరులైన వేమన కూడా అదే చెప్పారు.
ఇవన్నీ కూడా మనకు మనం స్వానుభవం
ద్వారా తెలుసుకోవాలి. ఇది శాస్త్రంలో ఉన్నది.
అంతా మన అనుభవమే.
కాకపోతే ఏమిటంటే
ఆ శాస్త్రానికి,
మన అనుభవానికి పెద్ద
గ్యాప్ వచ్చింది.
ఆ గ్యాప్ ని మనం మన సాధన ద్వారా
ఫిలప్ చేసుకోవాలి.
ఇంకా ప్రెస్
చేస్తుంటే ఆరెంజ్ రెడ్ కనపడుతుంది అంతా.
ఆరెంజ్ రెడ్ కాకుండా అనేక రంగులు,
అనేక రకాల వలయాలు,
కాంతి వలయాలు కూడా మనలో
తెరలు తెరలుగా,
తరంగాలులాగా మనకు కనబడుతున్నాయి.
ఇక్కడ ఇంకొక విశేషం
ఏమిటంటే మనం చూసేది మన ప్రాణశక్తితో చూస్తున్నాం.
చూడబడేది,
సూర్య భగవానుడిని
చూస్తున్నాం.
ఈ సూర్యభగవానుడు,
మనలో ఉన్న ప్రాణము ఒక్కటే.
కానీ ఇప్పుడు రెండుగా
ఉన్నాయి.
ఈ రెండు ఏకం చేయాలి మనం.
ఆ ఏకం చేసే స్థితికి మనం
వెళుతుంటే,
ఆ లోపలి సూర్యుడినే మనం ఆదిత్య
హృదయం ద్వారా,
అంటే యోగ సాధన ద్వారా ఆ లోపలి
ఆత్మ సూర్యుడినే,
మనం తేజో గురుడునే,
తేజోనారాయణుడినే,
చిదాకాశాన్నే,
ఆదిపరాశక్తి.
లలితపరాభట్టారికానే మనం చూస్తూ అందులో మనం ఐక్యం అవుతూ ఉంటాం.
ఈ విధంగా మనం అనుభూతి
పొందాలి తప్పించి కానీ,
నాకు అవేవో దర్శనాలు అయ్యాయి,
ఎవరెవరో కనిపించారు,
లేకపోతే,
అవన్నీ కాదు,
అవన్నీ వచ్చిపోతూ ఉంటాయి.
అవి కూడా మనల్ని భ్రమలోకి
నెట్టేవే.
మనల్ని మాయలో పడేసేవే.
అవి కావు మనకు
కావాల్సింది.
సత్యాన్ని గోచరించే వరకు కూడా,
మనకు ఆత్మ దర్శనం కావాలి.
మనలో ప్రాణశక్తి బంగారు
వర్ణంతో,
తప్త కాంచన సన్నిభం,
బంగారు వర్ణంతో
కనపడేటట్లు మనం సాధనలో ముందుకు వెళ్లాలి.
అది ఒకరోజు కనిపించేది,
ఒక రోజుతో అయిపోయేది కాదు.
అడవిలో
తపస్సు చేస్తున్న ఋషులు కూడా ఈ నిత్యకృత్యం చేయాల్సిందే.
ఇలా చేస్తూ చేస్తూ,
వారు ఒక స్థాయిలో వాయు
స్వాధీనం అయిన తర్వాత వారు బయటకు వచ్చి లోక కళ్యాణం చేస్తూ ఉంటారు.
కొంత మంది మహానుభావులు
ఇప్పటికీ కూడా వారి యొక్క సంకల్పశక్తి
అనుగ్రహం వలన,
వారందరూ కూడా మనకి,
ఋషులు ఋషి మండలం అంతా కూడా
మన వైపే చూస్తున్నారు. కాకపోతే వారి చూపుని మనము గ్రహించుకోలేని
స్థితిలో ఉన్నాం.
ఈ సాధన ద్వారా మనం చూస్తూ ఉంటే
అందరి అనుగ్రహం,
మన గురు పరంపర తరువాత ఋషి మండలం
అందరి అనుగ్రహం కూడా మన మీద పడుతుంది.
ఎప్పుడు?
మనలో వచ్చే సంకల్పం అంతా
కూడా వారిదే.
ఇంక మనం కేవలం నిమిత్త మాత్రులం.
నిమిత్త మాత్రంతో మనం
ఏమైనా చేయగలం.
కానీ కర్తృత్వం పెట్టుకుంటే మనమే
అంతా దానికి బాధ్యత వహించి దాని మంచిచెడులు పుణ్య పాపాలు అంతా
అనుభవించవలసి వస్తుంది.
కానీ నిమిత్త మాత్రంగా ఉన్నామంటే
నడిపించేది అంతా కూడా ...
యత్ కృతం యత్ కరిష్యామి తత్
సర్వం న మయా కృతం
త్వయా కృతం తు ఫలభుక్ త్వమేవ
మధుసూదన
అని
చెప్పినట్లు ఏమిటంటే,
యత్
కృతం - నేనేమి చేశాను;
యత్ కరిష్యామి - ఏమి
చేయబోతున్నాను;
తత్సర్వం న మయా కృతం - అదంతా కూడా
నా చేత
చేయబడుట లేదు.
(32.13) త్వయా కృతం
- తమరే చేశారు. నీవే
చేస్తున్నావు;
తు ఫల భుక్
- దాని తాలూకా ఫలితాన్ని
అనుభవించే భోక్తవు కూడా నీవే;
త్వమేవ మధుసూధన.
ఆ స్థాయిలో మనం
నిరంతరము కూడా ఆ భావనతో
సాధన
ద్వారా భావించామంటే,
మనం
మన గురుదేవులు చెప్పినట్లు
మన జీవితమంతా కూడా ఆడిందే
ఆట పాడిందే పాట. ఆడిందే
ఆట పాడిందే పాట అంటే అర్థం ఏమిటంటే మనకు అంతా
సుఖమయంగా గడిచిపోతుంది.
ఈ భౌతిక శరీరంతోన ఈ భౌతిక
ప్రపంచంలో
సుఖంగా జరుగుతుంది.
తర్వాత
ఎలాగును
ఆత్మ సామ్రాజ్యంలో ఆ
ఆనందాన్ని
అనుభవిస్తూనే ఉంటాము.
ఇప్పుడు మనం
సూర్యుని చూసి 20
నిమిషాలు అయింది. ఇప్పుడు
మనం
ఏం చేస్తున్నామంటే,
కళ్ళు తెరచి,
క్రిందకి దించి,
కళ్ళు మూసుకొని,
ఈ విధంగా ఈ చేతులు రబ్
చేసి,
బొటనవేలు ముఖ్యంగా రబ్ చేయాలి.
వేడెక్కినంత వరకు రబ్
చేయండి. దగ్గరగా
పెట్టి
నొక్కి
రుద్ధితే
బాగా వేడెక్కుతుంది.
ఆ వేడిని తీసుకొచ్చి
ఇక్కడ ఈ కళ్ళ కొలికి
దగ్గర
కళ్ళు మూసి ఇలాగ ఇలాగ ఇలాగ
(కంటి కొలికి నుంచి చెవి వైపుకు) మూడు సార్లు
కళ్ళు మూసి ఇలాగ,
కన్నీళ్లు కూడా
వస్తాయి.
ఇలాగ మూడుసార్లు
చేసి మళ్లీ రబ్ చెయ్యాల,
కళ్ళు గట్టిగా నొక్కి
వద్దు. ఇలా
అంటుంటే red
గా ఉండి తర్వాత (
34. 14)
ఇంకా వంగపండు రంగు,
yellow, deep yellow కనబడుతుంటుంది.
Red and yellow ,
ఇలా ప్రెస్ చేస్తుంటే.
మరల రబ్ చేయండి.
ఇలా ఆరు సార్లు చెయ్యాలి.
ఆ తర్వాత చూపుడు వేలు మీద
రబ్ చేయాలి.
ముఖ్యంగా చూపుడు వేలు. ఇక్కడ
పెట్టి ఇలాగా (.36.25)
మంచి
red
గా ఉండి,
అటువైపు వెళుతున్న కొద్దీ,
చెవి వైపు వెళుతున్న
కొద్దీ yellow
అవుతూ ఉంటుంది.
red, yellow. మరల.
వంగపండు రంగు అయితే చాలా
స్పష్టంగా కనబడుతుంది.
కళ్ళ జబ్బులు ఉంటే చాలా వేగంగా
నయమవుతాయి వీటివల్ల.
దృష్టిలోపం కూడా సవరింపబడుతుంది.
క్యాటరాక్టును కూడా
దగ్గరకు రానివ్వదు.
ఇలా ఆరు సార్లు అయిన
తర్వాత మరొక ఆరు సార్లు
గడ్డం దగ్గర పెట్టుకొని చెయ్యాలి.
ఇలాగ. (38.17)
మూడోసారి కూడా చూపుడువేలు
తోనే రబ్ చేసి,
గడ్డం దగ్గర పెట్టి చేయాలి.
మీరు
observe
చేయండి ఇప్పుడు
blue
కనబడటం లేదు.
Only red and yellow మనం
పడుకున్న తర్వాత కనపడుతుంది.
పడుకొని లేచినప్పుడు
blue
కనపడుతుంది.
అయిపోయింది కదా!
ఓం శ్రీ గురుభ్యోనమః.
ఇప్పుడు మనం
తిన్నగా సూర్యునికి ఎదురుగా కాళ్ళు పెట్టి పడుకోవాలి.
కళ్ళు మూసుకుని తర్వాత మధ్య వేలు
మన బొడ్డుకు ఇరువైపులా పెట్టాలి.
మిగతా వేళ్ళు సైడ్ కుఇలాగా
కడుపు పక్కన పెట్టుకోవాలి. పడుకోండి. మన మనసు ఇప్పుడు
walt of the skull,
అంటే,
మూర్ధ్నిస్థానం,
ఇక్కడ
madu
దగ్గర ఉంది మన మనసు.
అక్కడ పెట్టాము.
ఆ తర్వాత నుదురు. మనం
కళ్ళు మూసినప్పుడు red
గా,
brick red గా కనబడుతుంది
లోపల. నుదురు
తరువాత భ్రూమధ్యం.
రెండు కనులు క్రింద
భ్రూమధ్యం.
కుడి కనుబొమ.
(40.59) కుడి కన్ను పై
రెప్ప.
ఏది చెబుతున్నామో అదే
ఊహించుకోండి.
కుడి కన్ను కింద రెప్ప.
తర్వాత కుడి బుగ్గ.
తరువాత కుడి చెవి.
right ear. తరువాత ఎడమ
కనుబొమ. ఎడమ కన్ను పై రెప్ప.
ఎడమ కన్ను కింద రెప్ప (left
lower eyelid). ఎడమ బుగ్గ
(left cheek).
ఎడమ చెవి.
గడ్డం.
నోరు లోపల.
నాలుక.
అంగిలి (palate).
పై పళ్ళు,
క్రింద పళ్ళు.
పై పెదవి,
కింది పెదవి,
మెడ.
మెడ దగ్గర థైరాయిడ్.
ముఖ్యంగా లేడీస్,
థైరాయిడ్ ఉండే వాళ్ళు
అక్కడ ఎక్కువ మనసు పెట్టండి. మెడ
దగ్గర రెండు వైపులా థైరాయిడ్ ఉంది.
అక్కడ
మనసును ఎక్కువ పెట్టండి.
ఆ తర్వాత కుడి ఛాతి.
కుడి ఛాతిలో
పై భాగం. కుడి ఊపిరితిత్తి
పైభాగం (right lung upper lobe).
కుడి ఛాతి మధ్య భాగం. (right
lung middle lobe). కుడి
ఛాతి కింద భాగం (right lung lower
lobe). ఎడమ ప్రక్క ఎడమ
ఛాతి పైభాగం (left upper lob). ఎడమ
ఛాతి కింద భాగం (left lower lobe of
the lung) . తర్వాత ఈ
రెండింటి మధ్యలో గుండె. మన గుండె.
ఆ గుండె దగ్గర మనసు
పెట్టండి.
ఎడమ ప్రక్క ఎడమ ఛాతి భాగంలోన కింద
భాగంలోన ఈ lower lobe
కు
lingula
అని ఒకటి ఉంటుంది.
అది అక్కడ కవర్ చేస్తుంది.
అక్కడ ఉంటుంది గుండె.
ఇప్పుడు
గుండె దగ్గర పెట్టాము.
గుండె తర్వాత డయాఫ్రం కు
వచ్చాము.
డయాఫ్రం అంటే క్రింది భాగమైన
పొట్టకు,
పై భాగమైన ఛాతికి మధ్యలోన ఒక
కండరపు పొర. డయాఫ్రం కు కుడి ప్రక్కన దాని క్రింద లివర్ ఉంది.
కాలేయం.
లివర్ కు రెండు
lobs
ఉన్నాయి.
ఎడమ
lobe,
కుడి
lobe
రెండు భాగాలు. అలాగా అయిన తర్వాత
మళ్ళీ సెంటర్ కి వచ్చాం.
ఛాతి.
ఛాతి కింద సెంటర్ లోన.
అక్కడ మన జీర్ణాశయం ఉంది.
ఆ జీర్ణాశయము దానిపైన ఆహార
నాళం తాలూకా చివరి భాగం. usofagal
end. ఆ తర్వాత మన
ఎడమప్రక్కకు వచ్చాం.
ఆ ఎడమప్రక్క డయాఫ్రం.
తర్వాత కొద్ది క్రిందకు
వెళితే spleen -
ప్లీహము ఉంటుంది.
అలాగనే
chest
క్రింది భాగం - పొట్టకు ఎడమ పక్కన,
ఈ డయాఫ్రం కు కొద్దిగా
క్రిందన ఎడమ ప్రక్కన క్లోమ గ్రంధి (pancreas)
ఉంది.
షుగర్,
బిపి ఉండేవాళ్ళు ఈ
భాగమును ఎక్కువగా
స్మరించండి. ఎడమ ఛాతి క్రిందని,
డయాఫ్రం క్రిందని ఆ
భాగములోన pancreas
క్లోమగ్రంథి ఉంది.
ఆ క్లోమగ్రంధిని అలా
చూస్తూ ఉండండి.
దాని చివరన ప్లీహము
spleen ఉంది. ఇప్పుడు
మనము అక్కడి నుంచి కిందకు వెళ్తే బొడ్డు దగ్గరకు వెళుతున్నాం.
సరిగ్గా
ambalicus
దగ్గరకు వెళుతున్నాము.
అక్కడ చిన్న ప్రేవులు,
దానిచుట్టూ
చిన్నప్రేవుల్లో డియోడినం,
జజనం ఈ విధంగా మూడు భాగాలు
ఉన్నాయి చుట్టూను.
ఆ తర్వాత ఇంకా క్రిందకు వెళ్లి మన
కుడి మధ్యవేలు,
ఉంగరపు వేలు,
చిటికెన వేలు దగ్గరకు
వెళ్ళాము. (46.35)
అక్కడ చిన్నప్రేవులు పెద్ద
ప్రేవులు జంక్షన్ ఉంది.
అక్కడ నుంచి తిన్నగా
Right abdomen
అంటే మన కడుపు కుడి భాగంలోకి మనం
అలాగా వస్తున్నాం. అలాగ వచ్చి
ascending colon సీకం,
తరువాత
తరువాత కుడి డయాఫ్రం
దగ్గరకు వచ్చాం. అక్కడకు
వచ్చే ముందు కొద్దిగా వెనక్కు వెళితే,
ఈ
ascending colon కు
ఇంకా వెనక్కు వెళితే,
ఆ ఛాతి వెనక
భాగంలోకి వెళితే
కుడి మూత్రపిండం
right kidney
ఉంది.
కాబట్టి కిడ్నీ డిసీజ్
ఉన్న వాళ్ళు అక్కడ స్మరించండి.
వాటిపైన అడ్రినల్ గ్రంధి
ఉంది.
ఆ అడ్రినల్ గ్రంధి,
కిడ్నీలను స్మరించండి.
తర్వాత అలా వచ్చి డయాఫ్రం
క్రింద నుంచి వెళుతుంటే పెద్ద ప్రేవులు.
ఎడమ ప్రక్కకు వచ్చాము కుడి
నుంచి,
ఎడమ పక్కకు వచ్చి మళ్లీ ఈ ప్లీహము,
ఎడమ ఛాతి క్రిందిభాగంలోన
డయాఫ్రంకు క్రిందన ప్లీహము ఉంది.
ఆ ప్లీహము
పైన ముందు భాగం నుంచి మన
పెద్ద ప్రేవు అలా కిందకి దిగుతోంది. (47.48)
ఎడమ కడుపులోన.
left flank లోన.
తర్వాత అలా దిగి
S
షేప్ లోన
sigmoid colon అని
ఒకటి దిగుతుంది.
మన మలం నిల్వ ఉండేది.
అలా నిల్వ ఉండేది
రక్తంలోకి వెళ్తున్నాం.
తరువాత పురీషనాళం.
అంటే మలద్వారం దగ్గరకు
వచ్చాము ఇప్పుడు.
ఈ మలద్వారానికి ముందు భాగంలోని
మనకి రెండు భాగాలు ఉన్నాయి.
అవి ఏమిటంటే,
ముందు (యూరినల్
బ్లాడర్) మూత్రాశయం ఉంది.
ఈ మూత్రాశయానికి
మలద్వారానికి మధ్యలోన స్త్రీలకు
గర్భకోశం ఉంది.
uterus . (.48.25) ఆ
యుటెరస్
ప్రక్కనే కుడివైపున,
ఎడమవైపున ట్యూబ్ లు
ఉన్నాయి. తర్వాత అండాశయాలు ఉన్నాయి. ఓవరీస్.
ఆ విధంగా అయిన తర్వాత మనం
ఇప్పుడు తుంటి భాగానికి వచ్చాము.
తుంటి భాగం లోన హిప్
జాయింట్,
కుడి హిప్ జాయింట్,
తర్వాత కుడి తొడ,
తర్వాత కుడి మోకాలు చిప్ప
(right knee cap),
తర్వాత కుడి మోకాలు,
కుడి మోకాలు నుంచి కుడి
యాంకిల్,
యాంకిల్ నుంచి కుడి పాదం పై భాగం,
కుడి పాదం క్రింది భాగంలోన
సోల్,
అంటే
sole of the foot,
అరి పాదం.
అక్కడికి వచ్చాము.
మన మనసు అక్కడ ఉంది.
మళ్లీ ఎడమ హిప్ జాయింట్ కు
వచ్చాము.
ఎడమ షిప్ తర్వాత ఎడమ తొడ,
తర్వాత ఎడమ మోకాలు చిప్ప,
ఎడమ మోకాలు,
ఎడమ యాంకిల్,
ఎడమ పాదం,
ఎడమ అరి పాదం.
ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము?
మన మనస్సు ఇప్పుడు ఎక్కడ
ఉందంటే ఎడమ కుడి అరి పాదాల
దగ్గర ఉంది.
ఇప్పుడు
మళ్ళీ క్రింద నుంచి పైకి వస్తున్నాము.
రెండు అరిపాదాలు,
రెండు యాంకిల్స్,
రెండు మోకాళ్ళు,
రెండు మోకాళ్ళ చిప్పలు,
రెండు తొడలు,
రెండు హిప్ జాయింట్లు,
మళ్ళీ మధ్యలోకి వచ్చి
మూత్రాశయం (యూరినరీ బ్లాడర్),
స్త్రీలకి గర్భాశయం,
ఫెలోపియన్ ట్యూబ్స్,
అండాశయాలు,
కుడి ప్రక్కకు వచ్చి
ఇప్పుడు మీదకు వచ్చినప్పుడు ఏమిటంటే మూత్రాశయం నుంచి వెనుకకు వెళ్తే ఈ
మలద్వారం నుంచి ఎడమ ప్రక్క sigmoid
colon S షేప్
లో ఉంటుంది,
తరువాత
ascending colon,
డాక్టర్లు ఉన్నారు గనుక,
తర్వాత మీదకు వచ్చి ఆ
ascending colon తరువాత
ఎడమ డయాఫ్రం క్రిందనే ప్లీహము స్మరిస్తాము.
దాని వెనుక భాగంలో ఎడమ
కిడ్నీ ఉంది.
ఆ కిడ్నీ దగ్గర స్మరించాలి.
అలా అయిన తరువాత ఇప్పుడు
అడ్డంగా transverse colon,
డయాఫ్రం క్రింద నుంచి అలా
వస్తున్నాం.
వచ్చి కుడివైపు వచ్చాము.
కుడి వైపు పైన క్రిందన
కాలేయం ఉంది.
ఆ ప్రక్కనే మధ్యలోన
stomach
జీర్ణాశయం ఉంది.
Jataram. అలాగే క్రిందకి
దిగి ఆ ascending colon
కు వెళుతున్నాము.
ascending colon కు వెళ్లి
సీకం అనేది చిన్న ప్రేవులు పెద్ద ప్రేగులు జంక్షన్ లో ఉన్నాం ఇప్పుడు.
ఆ తర్వాత చిన్న
ప్రేవులలోకి వచ్చాము.
అది బొడ్డు క్రింది భాగమున
ఇరువైపులా.
మనం చిన్న ప్రేగులలోకి వచ్చాము.
చిన్న ప్రేవులలోన చివరి
భాగం ఈలియం,
ఈ మధ్య భాగంలోన జజనం,
ఇంకా మీదకు వస్తే మన
stomach
ని కలిపే డియోడినం ఉంది. (51.53)
ఆ డియోడినం
curve shape
లోనే క్లోమ గ్రంధి ఉంది.
అక్కడ ఇన్సులిన్
తయారవుతుంది.
అది తగ్గితే షుగరు.
అలా చివర ఆ
tail
ఒక నాలుకలా ఉంటుంది. ఇది
ప్యాంక్రియాస్ (క్లోమగ్రంథి).
దాని చివరలో ప్లీహము (spleen)
ఉంది.
. మనము ఇప్పుడు కడుపు
భాగము పూర్తి చేశాము.
ఇక్కడ ఛాతి లోకి
వచ్చాము.
ఛాతి లోకి వచ్చి ముందు గుండెను,
ఏడవ భాగములో గుండెను
స్మరిస్తున్నాము. తరువాత
ఎడమ ఛాతి లోన క్రింది భాగము ఊపిరితిత్తుల
lowe lobe, upper lobe,
ఎడమ ఛాతి లోయర్ లోబ్,
మిడిల్ లోబ్,
అప్పర్ లోబ్. ఆ తరువాత మెడ
దగ్గరకు వచ్చాము.
మెడ దగ్గర థైరాయిడ్,
పారా థైరాయిడ్
మెడ పైన,
కొద్దిగా మీదకు వచ్చి
గడ్డము,
గడ్డం దగ్గరకు వచ్చాం.
గడ్డం దగ్గరకు వచ్చి
క్రింది పెదవి దగ్గరకు వచ్చాం.
క్రింది పెదవి నుంచి
దంతాలు,
క్రింది దవడ,
క్రింద దంతాలు,
నాలుక,
నోరు,
పైదవడ,
పై పళ్ళు,
పై పెదవి,
ఎడమ బుగ్గ,
ఎడమచెవి,
ఎడమ కన్ను,
క్రింది కనురెప్ప,
ఎడమ కన్ను,
ఎడమ పై కనురెప్ప,
ఎడమ కనుబొమ,
కుడి భాగం,
కుడి బుగ్గ,
కుడిచెవి,
కుడి కన్ను క్రింది
కనురెప్ప,
కుడి కన్ను,
కుడి కన్ను పై కనురెప్ప,
కుడి కనుబొమ,
ఇప్పుడు మనకు ముఖ్యమైనది
ఇది,
రెండు కనుబొమల మధ్యన. మనం
భగవంతుని స్థానం భ్రూమధ్యంలోకి వచ్చాము.
భ్రూమధ్యంలో అలాగ ఉండండి.
ఆ తర్వాత మూర్ధ్ని స్థానం
(మాడు) కు వెళుతున్నాము.
పై భాగం,
తల పైభాగం.
మనము అయింది తల పైభాగంలో
ఉన్నాం ఇప్పుడు. ఒక
రౌండ్ అయింది.
ఇక ఏంటంటే,
ఇంకా కొద్దిగా మీదకు వెళ్దాం.
స్పీడ్ గా వెళదాం.
తల మాడు,
భ్రూమధ్యం,
నుదురు
2
భాగాలు,
కుడిచెవి,
కుడి కన్ను,
కుడి బుగ్గ,
ఎడమ నుదురు,
ఎడమ కనుబొమ,
ఎడమ కన్ను,
ఎడమ బుగ్గ,
ఎడమ చెవి,
గడ్డం,
మెడ,
థైరాయిడ్,
పారా థైరాయిడ్,
ఎడమ ఊపిరితిత్తులు పై మధ్య
క్రింది lobలు,
ఎడమ ఊపిరితిత్తి,
ఎడమ ఛాతిపై భాగము క్రింది
భాగము,
గుండె,
గుండె దగ్గరకు వచ్చాము.
ఆ తర్వాత మధ్యలోన కడుపు
దగ్గర కు వచ్చాం.
డయాఫ్రం క్రిందన,
దాని క్రింద డియోడినం
ఉంది.
ఆ డియోడినం వంకలో
ప్యాంక్రియాస్ ఉంది ఎడమ ప్రక్కన. దానికి చివరలో ప్లీహము ఉంది.
దాని వెనుక భాగంలో ఇంకా
వెనక్కు వెళ్తే ఎడమ
మూత్రపిండం ఉంది.
తర్వాత ఎడమ పక్క కాలేయం
right lobe, left lobe,
తర్వాత ఇంకా వెనక్కు వెళ్తే. ఈ
కుడి ఛాతి డయాఫ్రం క్రింద ఇంకా వెనక్కు వెళ్తే కుడి మూత్రపిండం,
తర్వాత మధ్యలోన బొడ్డు
దగ్గర చిన్న ప్రేవులు,
డియోడినం,
జజనం,
ఈలియం,
తర్వాత మన కుడి చిటికెన
వ్రేలు బొడ్డు క్రింద కుడి భాగంలో సీకం ఉంది.
అక్కడ నుంచి మనం ఇప్పుడు
అసెండింగ్ కొలాన్ కుడి వైపు
కుడి ప్లాంక్ లో నుంచి
పైకి వస్తున్నాం.
పైకి వచ్చి ఎడమ ట్రాన్సిల్ కొలాన్
క్రింద నుంచి ఎడమ కడుపులోకి వచ్చాము.
డయాఫ్రం క్రింద.
అక్కడ
spleen, వెనుక
మూత్రపిండము,
తర్వాత క్రిందకి మలద్వారం
కు వచ్చాం. Sigmoid colon, ductom,
మలద్వారం.
దానిముందు యూరినరీ
బ్లాడర్,
స్త్రీలు గర్భాశయం,
అండాశయం,
తరువాత కుడి హిప్ జాయింట్,
కుడి తొడ,
కుడి మోకాలి చిప్ప,
కుడి కాలు,
కుడి యాంకిల్,
కుడి పాదం పై భాగం,
కుడి పాదం క్రింది భాగం (sole
of the foot), మన మనసు
ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే కుడి పాదం ఈ క్రింది భాగం అరిపాదంలో ఉంది.
తరువాత ఎడమ హిప్ జాయింట్,
ఎడమ తొడ,
ఎడమ మోకాలు చిప్ప,
ఎడమ కాలు,
ఎడమ యాంకిల్,
ఎడమ పాదం,
ఎడమ పాదం పై భాగం,
ఎడమ కాలు క్రింది భాగం,
ఎడమ కాలు అరిపాదం,
ఇప్పుడు మనం అరిపాదాలు
రెండు,
రెండు యాంకిల్ జాయింట్ లు,
రెండు కాళ్లు,
రెండు మోకాళ్లు చిప్పలు,
రెండు తొడలు,
రెండు హిప్ జాయింట్ లు,
తరువాత మలద్వారం,
తర్వాత పెద్ద ప్రేవులు,
ఎడమ భాగం,
తర్వాత అడ్డంగా
transerves colon,
కుడివైపు
descending colon,
తరువాత బొడ్డు క్రింద చిన్న
ప్రేవులు,
ఈ కుడి కడుపులో వెనుకభాగం
మూత్రపిండం,
ఎడమ మూత్రపిండం,
అలాగే ఎడమ కడుపు
భాగంలోవెనక భాగం ఆ ఛాతికి బోర్డర్లోన వెనుక భాగం ఎడమ మూత్రపిండం,
దానికి ముందు భాగంలో
ప్లీహము,
ప్లీహము నుంచి కుడివైపుకు ఇలా
వస్తే ప్యాంక్రియాస్,
కడుపుకి ఎడమ భాగంలో క్రింది
భాగంలో ఉంది
క్లోమగ్రంథి,
ఆ తర్వాత గుండె కి
వచ్చాము.
గుండె,
గుండె తర్వాత ఎడమ ఛాతి
భాగం,
ఎడమ ఊపిరితిత్తి,
తర్వాత కుడి ఊపిరితిత్తి
మూడు భాగాలు,
తర్వాత మెడ,
థైరాయిడ్,
పారా థైరాయిడ్,
గడ్డం,
క్రింది పళ్ళు,
క్రింది పెదవి,
నాలుక,
అంగిలి,
మెత్తని అంగిలి,
గట్టి అంగిలి,
పై దవడ,
పై పళ్ళు,
పై పెదవి,
ముక్కు,
ముక్కుకు కుడి వైపున కుడి
బుగ్గ,
కుడి చెవి,
కుడి కన్ను,
ముక్కు ఎడమ ప్రక్క ఎడమ
బుగ్గ,
ఎడమ చెవి,
ఎడమ కన్ను,
కనుబొమ్మల మధ్య భాగం,
భ్రూమధ్యం,
భ్రుకుటి,
నుదురు (fore
head), తర్వాత వాల్ట్,
అంటే మూర్ధ్ని స్థానానికి
వచ్చాం.
ఆ తర్వాత
మరలా మాడు,
నుదురు,
కుడి కన్ను,
కుడి చెవి,
ఎడమ నుదురు,
ఎడమ కన్ను,
ఎడమ చెవి,
దవడ,
బుగ్గ,
మెడ,
కుడి ఛాతి,
ఎడమ ఛాతి,
(1.00.32), గుండె,
కుడివైపు కాలేయము,
ఎడమవైపు ప్లీహము,
మధ్యలో కడుపు,
దానికి వెనుక ఎడమ
మూత్రపిండం,
అలాగనే కుడివైపు కాలేయము,
తర్వాత కాలేయానికి ఆనుకొని
transerves colon, తర్వాత
కుడివైపు డయాఫ్రం వెనుక కుడి మూత్రపిండము,
ఈ విధంగా పెద్ద ప్రేవులు,
చిన్న ప్రేవులు,
కడుపులోన మూత్రాశయం,
స్త్రీల గర్భాశయము,
తర్వాత కుడి ఎడమ హిప్
జాయింట్లు,
కుడి ఎడమ తొడలు,
ఎడమ కుడి మోకాలి చిప్పలు,
తర్వాత కుడి
fore leg (ముంగాలు),
అలాగే ఎడమ
fore leg,
ఆ తర్వాత యాంకిల్ కుడి ఎడమ,
ఆ తర్వాత పాదము క్రింది
భాగము రెండు వైపులా,
అరి పాదాలు.
ఈ విధంగా రెండు సార్లు
స్మరించుకున్నాము.
ఇక మూడోసారి ఏమిటంటే
just
అలాగా క్రిందనుంచి మనము
చెప్పకుండానే,
అలాగా ఊహించుకుంటూ రావాలి.
మనం ఇప్పుడు
ఇలా లేస్తున్నాం. సూర్య
దేవుని వైపు నమస్కారం చేసుకుంటూ లేస్తున్నాము.
ప్రక్కకు తిరిగి లేవండి.
ఇప్పుడు రెండు చేతులు బాగా
రబ్ చేసి
ఇప్పుడు నుదురుపై నుంచి ఇలాగా
పెట్టండి. (నుదురు పైనుంచి కళ్ళ మీదుగా క్రిందకు ఇలాగా చేతులు జరపండి)(1.03.09).
ఇప్పుడు బ్లూ కనపడుతుంది.
dark blue, red అన్ని
రంగులు, blue
కనపడతాయి.
ఇంతవరకూ
dark blue కనపడలేదు.
ఇప్పుడు కనబడుతుంది
చూడండి. dark blue, red.
మనం కళ్ళు మూసే సరికి
red
గా,
brick red, సృష్టిలో ఇంత
red
ఎక్కడ ఉండదు.
అంత
red.
అందులో చిన్న
yellow.
తరువాత చేతులు ఇలా పామి,
రబ్ చేసి నుదురు మీద
చేతులు పెట్టేసరికి,
బ్లూ,
ఎన్నో రంగులు,
ఎన్నో తరంగాలు,
అన్ని కనబడుతున్నాయి
చూశారా!
ఇది ఒక ఆరు సార్లు. బ్లూ,
ఆ బ్లూ ఇండికేషన్ ఏమిటంటే
మనకు లోపల,
మన కంటిలోకి సర్కులేషన్ బాగా
వచ్చి,
ఆ సూర్యశక్తి అనేది మనకి లోపల
వచ్చినదని అర్థం.
అది వచ్చి మన శరీరం అంతా వ్యాప్తం
చేశామని అర్థం.
మొదట లేని బ్లూ ఇప్పుడు వచ్చింది.
తర్వాత ఇలా చేసినప్పుడు
కొంతమందికి తేన్పులు వస్తుంటాయి చూడండి.
ఇప్పుడు అనేక రకాల
దర్శనాలు పడుకున్నప్పుడే కనబడుతుంటాయి.
ఇప్పుడు తేన్పులు.
ఒక్క తేన్పు వచ్చినా చాలు.
ఓం మిత్రాయ నమః
ఓం సూర్యాయ నమః
ఓం భానవే నమః
ఓం రవయే నమః
ఓం ఖగాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం హిరణ్యగర్భాయ నమః
ఓం మరీఛాయ నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం సవిత్రే నమః
ఓం అర్కాయ నమః
ఓం భాస్కరాయ నమః
ఓం సవిత్రు సూర్య నారాయణాయ నమః
ఓం శ్రీ గురుభ్యోనమః
ఇంతటితో సౌర
యోగము సమాప్తము అయినది.
దీనివల్ల ప్రయోజనాలు ఏమిటంటే,
ఈ సౌర యోగమువల్ల ప్రయోజనాలు అనేకం
ఉన్నాయి.
ముఖ్యంగా అవి ఏమిటంటే మన ఈ పైభాగం
అంటే,
ఛాతీలో ఉండే,
ఊపిరితిత్తులలో ఉండే
రుగ్మతలు,
గుండెలో రుగ్మతలు,
తర్వాత కన్ను జబ్బులు,
తర్వాత జీర్ణశక్తి
పెరుగుతుంది.
తర్వాత బ్లడ్ ప్రెజర్,
షుగర్ అవే తగ్గుతాయి.
జీర్ణశక్తి ఎప్పుడైతే
పెరిగిందో అన్ని జబ్బులు తగ్గుతాయి. ఇది ప్రాణాయామము చేయనివారు కూడా
చక్కగా చేసుకోవచ్చు.
ప్రాణాయామము చేస్తున్న వారికి
ఇంకా multiply
అవుతుంది.
తర్వాత వీటివల్ల మనం కనీసం
బలవంతంగానైనా ఒక అరగంట కూర్చున్నాం కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీ
కూడా మనకి ఉండదు.
మన భారతీయులకి ఈ సన్ బాత్ అనేది,
రైతులకు తప్పించి మిగతా
వాళ్ళు,
ఈ ఉద్యోగస్తులు వీళ్ళందరూ ఏమిటంటే,
సూర్యరశ్మికి
expose
అయ్యే అలవాటు లేదు.
అయితే పాశ్చాత్యులు మిగతా
వాళ్ళందరూ కూడా సన్ బాత్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్లకు విటమిన్ డి
డెఫిషియెన్సీ ఉండదు.
మనము ఈ విధంగానైనా అలవాటు
చేసుకుంటే,
మనకు దైవ చింతన పెరుగుతుంది,
ఆరోగ్యం పెరుగుతుంది.
గురు స్మరణ జరుగుతుంది.
అన్ని జరుగుతాయి.
ఈ విధంగా ఎవరికి వీలైతే
వాళ్ళు,
ప్రత్యేకంగా ఈ వింటర్ సీజన్ లోన ఈ
సౌర యోగం చేసుకుంటే మంచిది.
ఎండాకాలంలో తగ్గినా పర్వాలేదు.
తర్వాత మనం ఎంతగా భగవంతుణ్ణి,
సూర్య భగవానుడుని,
సూర్య భగవానుడు అంటే
ప్రత్యక్ష దైవం,
సూర్యనారాయణ మూర్తి,
ఆ నారాయణుడే
సూర్యభగవానుడిలో ఉన్నారు,
మనం ఆ విధంగా ఆరాధన చేసుకుంటే
మనకి
ఆయుష్షు,
ఆరోగ్యం,
ఐశ్వర్యం,
జ్ఞానం అన్ని కలుగుతాయి.
ఓం శ్రీ గురుభ్యోనమః
సర్వేజనా సుఖినోభవంతు,
లోక సమస్తా సన్మంగళాని భవంతు
ఓం స్వస్తి ప్రజాభ్యాం
పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీశాం
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకా సమస్తా సుఖినోభవంతు
కాలే వర్షతు పర్జన్యః పృథివీ
సస్యశాలినీ
దేశోయం క్షోభరహితో
బ్రాహ్మణాస్సంతు నిర్భయాః
ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు
నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్
దుఃఖభాక్భవేత్
ఓం
సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై
తేజస్వి నావధీతమస్తు మా
విద్విషావహై
ఓం శాంతి శాంతి శాంతిః
ఓం శ్రీ గురుభ్యోనమః
జై గురుదేవ