
75. మోక్షమనగా తాను కలిపించుకున్న ఇంద్రియ ప్రపంచ బంధము నుండి విడివడుట
శ్వాస ద్వారా అదోముఖమై బహిర్ముఖమగుటచే తనకు తాను పంచెంద్రియముల ద్వారా ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించుకుని జగత్ సత్యము తానైన బ్రహ్మము మిధ్య అనే స్థితికి వచ్చి బంధీంప బడుచున్నాము. మరల అదేశ్వాసను ఊర్ధ్వ గమనము చేసుకున్నచో ఈ సృష్టి లయమై విముక్తుల మగుచున్నాము.