ఓం శ్రీ గురుభ్యోనమః
🙏🙏🙏🙏🙏🙏
విశ్వాన ఎగిరింది
భారతీయ ద్వజం
ఆధ్యాత్మిక గురువుల
అద్వితీయ తేజం
🌺🪷🌺🪷🌺🪷
ఈనాడు మనకు
విశ్వయోగా దినోత్సవం
ఈ నాడే మన శివానందుల
మహా సమాధి మహోత్సవం
🪷🌺🪷🌺🪷🌺🪷🌺
కాదు కాదిది యాదృచ్ఛికం
దాగి ఉన్నది మహర్షుల ఐచ్ఛికం
జరిగేను సిద్ధ విద్యా వ్యాప్తి
కలిగేను బ్రహ్మ విద్యా ప్రాప్తి
🌺🪷🌺🪷🌺🪷🌺🪷
మన పతంజలి యోగా
విశ్వాన వేసింది పాగా
విజ్ఞత కాదు ఇక్కడే ఆగా
తెలియని సామాన్యుల లాగా
🪷🌺🪷🌺🪷🌺🪷🌺
యోగాని చేయాలి యోగం
ఒక్క సున్నాతో పరిపూర్ణ రాగం
శివానందుల సిద్ధయోగం
అభ్యసించుటే మహా యాగం
🌺🪷🌺🪷🌺🪷🌺🪷
అంతర్ముఖుల దీక్షాపర్వం
అద్వైత శిఖరాలు చేరుటే సర్వం
శీఘ్రమే రావాలి శుభోదయం
అందరికీ కలగాలి మహోదయం
,🪷🌺🪷🌺🪷🌺🪷🌺🌺
జై శ్రీ శ్రీ శ్రీ శివానంద
జై శ్రీ శ్రీ శ్రీరామానంద
జై శ్రీ శ్రీ శ్రీ అంతర్ముఖానంద
జై గురుదేవ్ 🙏🙏🙏
గురువుగారి భక్తురాలు రంగనాయకమ్మ
