Om Shree Gurubhyo Namaha
Oct 23, 2024
From the desk of Sri Guruji
Dr. Antarmukhananda Swamy
సాధకులకు బ్రహ్మ విద్యా సాంప్రదాయ ధర్మ వివరణ
గురుసేవ చేస్తూ, శాస్త్రం లోని మర్మములు తెలుసుకున్నవారు మాత్రమే సాధనా మర్మములు శిష్యులకు చెప్పగలరు. బయటవాళ్లు ఏది చెప్తే అది వినకూడదు, వింటే సాధన తప్పు దారి పడుతుంది. గురువు చెప్పినదే చెయ్యాలి. గురువు చెప్పినదానికి భిన్నంగా చేసేవారు సాధనలో సిద్ధి పొందలేరు, గురు అనుగ్రహం పొందలేరు, గురువు మనసులో కూడా వుండరు.
స్వామీజీ ఇంకొక గురువు పేరేత్తనీయకుండా తమ శిష్యులను నియంత్రించేవారు. స్వామీజీ తపస్సు చేసినట్లు ఇప్పటి గురువు లెవరూ చేసి వుండరు. అటువంటి స్వామీజీ వద్ద ఎన్నో సంవత్సరాలు సేవ చేసి, శిక్షణ పొంది, గృహస్తు అయికూడా ఒక ముని వలే తీవ్ర సాధన చేసి, గురు కటాక్షం తో వారు చెప్పిన బ్రహ్మవిద్యా రహస్యాలు విని, అనుభవించి, హృదయపూర్వకంగా వారిని స్మరించి మీకు చెప్పేదే ఈ వేదాంతం.
గురు దృష్టిలోకి వచ్చిన వాడే పరంపర లోకీ వస్తాడు. ఏకమేవ అనే అద్వైతం లోకీ చేరుకుంటారు. గురువు నుండి వెరైనవాళ్ళు ఇంకా జన్మత్తాల్సిందే. గురువు చేత నీవూ నేనూ ఒకరమే అని పిలిపించుకునే వాళ్లే పరంపర లోకీ వస్తారు. మిగతా వాళ్ళు స్వార్థపరులు, దాతృత్వం లేక గురువుకి దూరంగా ఉంటారు, అంతే కాదు వారు ఏ గురుపరంపరకు కట్టుబడకుండా ఉదారవాదిగా ఇతర గురువులు ఏమి చెబుతున్నారో అని పరిశీలిస్తుంటారు.
బ్రహ్మ విద్య యూట్యూబ్ వంటి మీడియా ద్వారా సులభముగా అందరికీ అందినట్లు కనిపిస్తుంది కానీ ఒక జీవుడు తన వాసనా బలాన్ని దగ్ధం చేసుకోవాలంటే గురువును సదా అశ్రయించనిదే, తీవ్ర సాధన చేయనిదే సిద్ధి పొందలేరు అందులకు ఎంతో త్యాగం అవసరం, నిరహoకారంగా సమర్పణ బుద్ధి అవసరం, ఇవేవి లేకుండా కేవల ఆధ్వయిత జ్ఞానం వలన గాని లేక స్వార్ధం తో తానొక్కడినే మోక్షం పొందాలనే భావం తో వున్నవారు తరించటం కష్టతరం.
నిజమయిన సిద్ధవిద్య సాధకులు అందరికి ఈ విషయము తెలియాలి.
Om Tat Sat!