వేదాంతం వ్రాసి పంపించడము

Om Shree Gurubhyo Namaha:
From the desk of Sri Guruji…

శ్రీ గురూజీ ప్రసంగాలు 1700 కంటే ఎక్కువ యూ ట్యూబ్‌లో వుండగా మన భక్తులు వేరు గా వేదాంతం వ్రాసి పంపించడము గాని స్టేటస్ లో పెట్టడము గాని చెయ్యటం వల్ల వాళ్ళు తమ తప్పులను దొర్లించే అవకాశముంది.

సాధన పెంచుకోకుండా ఇలా కాలం వృధా చేసుకోవడము ఆధ్యాత్మిక ప్రగతి అనిపించుకోదు. పరస్పరం చర్చించుకోవచ్చు కాని వ్రాతములకంగా కాదు.

మూకాస్వా దనవత్-బ్రహ్మసూత్రం Muka-asvadanavat: like the taste of a dumb-man అంటే మూగవాడు రుచికరమైన భోజనాన్ని తింటూ తనలోపలనే ఆనందించిన్నట్లు సాధకుడు ఆనందంలో నిమగ్నమవుతాడు తప్ప, బయట వేదాంతం చెబుతూ ఆనందించడు. అది కేవలం గురువులు మాత్రమే లోకకల్యాణార్థమై తమ అనుభవాన్ని వ్యక్తం చేస్తూ వుంటారు.

మనం చేస్తున్నది అంతర్ముఖం కానీ బహిర్ముఖం కాదని అందరూ మర్చిపోవద్దు.

Om Tat Sat!