73. స్థూల దృష్టికి భగవంతుడు ఖండముగా, నామ రూపములుగా దోచును. 74. సూక్ష్మ దృష్టికి తాను అఖండముగా తేజోమయుడిగా కనిపించును. ప్రాణవాయు మధనం చేసినచో స్తూల ప్రకృతి లో సూక్ష్మ పరమాత్మను చూడ గలుగుతాము
73. స్థూల దృష్టికి భగవంతుడు ఖండముగా, నామ రూపములుగా దోచును. 74. సూక్ష్మ దృష్టికి తాను అఖండముగా తేజోమయుడిగా కనిపించును. ప్రాణవాయు మధనం చేసినచో స్తూల ప్రకృతి లో సూక్ష్మ పరమాత్మను చూడ గలుగుతాము
72. మనస్సు ప్రాణచలనము వలన చలించుచున్నది. కనుక ప్రాణ చలనమును అరికట్టే ప్రాణాయామమే కోరికలను నశింపజేయును
67. అతీంద్రియావస్థే సర్వజ్ఞత్వము. ప్రాణవాయు నిగ్రహమే అతీంద్రియావస్థ(భ్రూమధ్యము నందు)
97. సత్వము, తమస్సు బయటకు ఒకే విధముగా కనిపించును. సత్వములో చైతన్యము,జ్ఞానము, ఆనందము ఉందును. తమస్సులో జడత్వము, బుద్ధి మాంద్యము,అలసత్వము ఉండును.
“అన్నదోషము చిత్తమును మలినము చేయును. మలిన చిత్తమునకు జ్ఞానము కలుగదు.”
“శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిధ్యతే”అంటే ఈ భోతిక గోపుర శిఖరం ను చూచుట కాదు తన శిరసులోనే జ్యోతి దర్శనం చేసుకున్నవానికి జన్మ పరంపరల చీకటి తొలగిపోతుంది.”
96. తనలో తన ఆత్మను చూచుట స్వధర్మము. అన్యముగా దైవమును భావించుటపరధర్మము.
ఈశ్వర ప్రసాదము, గురు ప్రసాదం, బుద్ధి ప్రసాదము ఈ మూడింటిలో ఏది లోపించిననూ పురుషునికి ముక్తి లభించదు.